
AITUC leaders
గాంధారి మైసమ్మ ముఖ ద్వారం ఏర్పాటు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి ఏరియా సింగరేణి సహకారంతో క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధారి మైసమ్మ ఆలయం సమీపంలో కమిటీ సభ్యులు ముఖ ద్వారాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ 2004 సంవత్సరంలో బొక్కలగుట్ట హైవే రోడ్డు అనుకోని అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని, అప్పటి నుండి ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగడంలేదన్నారు. ఈ నెల 20 తేదీన గాంధారి మైసమ్మ జాతర జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ బోనాల జాతరకు సింగరేణి, ఫారెస్ట్ అధికారులతో పాటు క్యాతనపల్లి మున్సిపాలిటీ అధికారులు అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నారని, ఈ సంవత్సరం కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గుర్తింపు సంఘం నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.