గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లోని అన్ని గ్రామాలను నుండి మండల విస్తృత స్థాయి సమావేశానికి హాజరుకావాలని గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ ప్రకటనలో తెలిపారు 14-04-2024 ఆదివారం రోజున రాబోయే ఎంపీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది సమయం మధ్యాహ్నం 12 గంటలకు స్థలం లక్కం జయ చంద్ర గార్డెన్ చేల్పూర్ బస్టాండు దగ్గర
ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థి కడియం కావ్య భూపాల్ పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు భూపాల్ పల్లి జిల్లా ప్రెసిడెంట్ అయితే ప్రకాష్ రెడ్డి వారు రానున్నారు కావున కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అద్యక్షులు మహిళా అధ్యక్షులు మండల ప్రజా ప్రతినిధులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు బూత్ కమిటీ అధ్యక్షులు యువజన నాయకులు మహిళా నాయకురాళ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు