గణంగా పోచమ్మ బోనాలు

చందుర్తి, నేటిధాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర మరియు శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రోజున పోచమ్మ అమ్మవారికి బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సాన జలంధర్ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నిర్వహించే బోనాల పండుగ కార్యక్రమాన్ని ఈరోజు మా గ్రామంలోని పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది . వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆ పోచమ్మ అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు.. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ సభ్యులు మరియు గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *