
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని నాగరాజు పల్లి శివారులో మద్ది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండేళ్లకోసారి అత్యంత వైభవంగాజరుగుతుంది అదేవిధంగా ఆలయ అభివృద్ధి కమిటీని మార్పు చేయడం జరుగుతుంది దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశనుసారం మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో అందరి అభిప్రాయ మేరకు ఆలయ ట్రస్టు చైర్మన్ గా గాదె సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు అలాగే డైరెక్టర్లుగా మేడిద కరుణాకర్, అనుముల సంతోష్, కదురు నరేష్, మందలింగారెడ్డి, చింతల బుచ్చిరెడ్డి, కన్నబోయిన సాంబయ్య, సూరినేని గోపాల్ రావు, బొంపల్లి శ్రీను లను ఎన్నుకోవడం జరిగిందని రాబోయే జాతరను విజయవంతం చేసే విధంగా నూతన కమిటీ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం నూతన కమిటీ మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే మాధవ రెడ్డికి, మండల, జిల్లా పార్టీబాధ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జాతరను వైభవంగా జరుపుకునే విధంగా తమ వంతు కృషి చేస్తామని వారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాలోత్ రమేష్ నాయక్, వైనాల అశోక్, జిల్లా మునీందర్, మోహన్, ఎరుకల రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.