ఉప్పల్ నేటిధాత్రి మార్చి 09
ఉప్పల్ డిప్యూటీ కమీషనర్ జి.హెచ్.యం.సి, ఉప్పల్ సర్కిల్
ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు దారులకు తెలియజేయునది ఏమనగా తేది. 10-03-2024 ఉ 9.00 గంటల నుండి మ 1.00 గంటల వరకు సిటిజన్ సర్వీస్ సెంటరు తెరచి ఉంచబడును మరియు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనగలరని మరియు ఆస్తివన్నుకు సంబందించి ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని 10-03-2024 ఆదివారం ఉ 09.00 గంటల నుండి 1.00 గంటల లోపల ఉప్పల్ సర్కిల్ కార్యాలయము నందు పరిష్కరించుకొనగలరని కోరడమైనది (ఆస్తిపన్ను పరిష్కారం)
సకాలములో ఆస్తిపన్ను కట్టి నగర అభివృద్ధికి తోడ్పడగలరని కోరడమైనది.