# నిందితుడు కట్టయ్యకు 14 రోజులు రిమాండ్.
నర్సంపేట,నేటిధాత్రి :
మద్యం మత్తులో ఇంట్లో చొరబడి భయాందోళనలకు గురిచేస్తూ ఫర్నీచర్ ధ్వంసం చేసిన సంఘటన దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో జరిగిన సంఘటనలో ఒక వ్యక్తి అరెస్టు చేసినట్లు ఎస్సై పరమేష్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలంలోని
చాపలబండ గ్రామానికి చెందిన పరికి కట్టయ్య మద్యం మత్తులో గిర్నిబావి గ్రామానికి వచ్చి రోడ్డుపై ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ చేతిలో ఇనుపరాడు పట్టుకుని బూరుగుల రమేష్ ఇంటి వద్దకు వెళ్ళాడు. అక్కడ వారిని బెదిరించి ఇంట్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశాడు.బాధితుని పిర్యాదు మేరకు పరికి కట్టపై కేసు నమోదు దర్యాప్తు అనంతరం చేసి శుక్రవారం నర్సంపేట కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. రౌడీ వేషాలు వేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై, భూ తగదాలలో గొడవలు పెట్టుకున్న , ప్రజాశాంతికి భంగం కలిగించే పనులు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై పరమేష్ హెచ్చరించారు.