డిసెంబర్ 2న చలో మిర్యాలగూడ బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
డిసెంబర్ 2న మిర్యాలగూడలో జరిగే బహిరంగ సభకు ఇంటికో మనిషి _ ఊరుకో బండి చలో మిర్యాలగూడకు తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. గురువారం చండూరు మండల పరిధిలోని బోడంగి పర్తి గ్రామంలో మిర్యాలగూడ జరిగే బహిరంగ సభకరపత్రంను ఆవిష్కరించారు. అనంతరంబహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటికి తిరిగిప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బిజెపి అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వలన పారిశ్రామిక, వ్యవసాయరంగం తీవ్రంగా దివాలా తీసింది అని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు మెని ఫెస్టోలో ఇచ్చిన ఆరు పథకాలను అమలు చేయాలనిఆయన అన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని ఆయన అన్నారు. దేశంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికలు తీసుకురావడానికిప్రయత్నం చేస్తుందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అనుసరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, బిఎస్ఎన్ఎల్, విమాన యానం, ఎల్ఐసి, గనులు సహజ వనరుల మొత్తాన్ని స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు దారా దత్తం చేస్తుందని ఆయన విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య యుతంగా పాలన చేయవలసిన మోడీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతుందని, ఈ మతోన్మాద విధానాలపై భవిష్యత్తులో ప్రజలను సమీకరించి చైతన్యం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం బోడంగపర్తి గ్రామ శాఖ కార్యదర్శి గౌసియా బేగం, సిపిఎం నాయకులు ఈరటి వెంకన్న,గిరి,సైదులు, జాంగిర్ తదితరులు పాల్గొన్నారు.