రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వేణు కుమార్ అధ్యక్షతన స్నేహిత కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు గ్రీష్మన్య విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలని జంక్ ఫుడ్ తినకూడదని తెలియజేశారు మరియు అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ ఏది బ్యాడ్ టచ్, ఏది గుడ్ టచ్ అనే దాని గురించి వివరించారు. ఈకార్యక్రమంను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ వేణు కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దనీ, చదువుపై దృష్టి పెట్టాలనీ విద్యార్థులకు తెలియజేశారు. ఈకార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ బుర్ర సాయిలు గౌడ్, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు శైలజ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయబృందం, తదితరులు పాల్గొన్నారు