గొర్రెకుంటలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం
ఛాతీ ఎక్స్‌రే, బీపీ, షుగర్ పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ
గీసుకొండ, నేటిధాత్రి:
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గొర్రెకుంటలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామీణ ఆరోగ్య ఉపకేంద్రం వద్ద డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో, గీసుకొండ మండల వైద్యాధికారి డాక్టర్ శౌర్య శరణ్య పర్యవేక్షణలో శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఉచితంగా ఛాతీ ఎక్స్‌రే, రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలను సద్వినియోగం చేసుకున్నారు. కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎలగొండ ప్రవీణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పరీక్షలు, మందులను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. శిబిరం నిర్వహించిన వైద్య బృందాన్ని అభినందించారు.ఈకార్యక్రమంలో మధ్యస్థ స్థాయి ఆరోగ్య సేవలందించే వైద్యాధికారి డాక్టర్ నేహా, ఎలగొండ ప్రవీణ్, మార సాగర్, ఇంద మనోజ్, ఏఎన్‌ఎంలు శకుంతల, భవాని, మాధవి, ఆరోగ్య సహాయకుడు శ్రీనివాస్, పర్యవేక్షకుడు కిరణ్‌కుమార్, ఎక్స్‌రే ఆపరేటర్ రంజిత్, ఆశా కార్యకర్తలు ఈసంపెళ్లి వజ్ర, ల్యాదల్ల నిర్మల, కొట్టే అపరంజి, బందెల రమ్యకృష్ణ, ప్రయోగశాల సాంకేతిక నిపుణురాలు కల్పన పాల్గొన్నారు.
