
Free health camp
https://youtu.be/EC5Z8gibvKc?si=55Iebk-pbIpN8u87
లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం
52మందికి రక్త,మూత్ర పరీక్షలు నిర్వహించి ఉచిత మందుల పంపిణీ
పరకాల నేటిధాత్రి
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ ఆధ్వర్యంలో మంగళవారం పరకాల నియోజకవర్గ పరిధి దామెర మండలంలోని లాదెళ్ల గ్రామంలో రూరల్ హెల్త్ సెంటర్ లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బిపి.ల్,షుగర్,రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు.ఈ సందర్బంగా చైర్మన్,పాలకవర్గం మాట్లాడుతూ లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి 52 మందికి ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగిందని తెలిపారు.సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.ఈ ఆరోగ్య శిబిరంలో రెడ్ క్రాస్ డాక్టర్లు డాక్టర్.కిషన్ రావు,డాక్టర్.మొహమ్మద్ తయార్ మసూద్,రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్,గంగాధర్,సతీష్, శ్రీకాంత్,నర్సింహ చారి,కిట్స్, జి.వర్షిత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.