చెన్నూర్,నేటి ధాత్రి::
పేద ప్రజలకు మెరుగైన ఉచిత నేత్ర వైద్య ఆపరేషన్లు చేసుకుని కళ్ళల్లో వెలుగులు నింపేలా…లయన్స్ క్లబ్ మంచిర్యాల గర్మిల్ల మరియు రేకుర్తి ఉచిత కంటి వైద్య ఆసుపత్రి వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య క్యాంపు ఈ నెల 8వ తేదీన చెన్నూర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించరు.ఈ క్యాంపులో సుమారుగా 140 మందికి కంటి చూపు ఆపరేషన్ కు వైద్యుల నిర్దారణ చేయడం జరిగింది అని అధ్యక్షుడు మొదుంపురం.వెంకటేశ్వర్ తెలియజేశారు. అనంతరం ఒక్కొక్క బ్యాచ్ లో 30 మంది చొప్పున రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ కి పంపించడం జరిగింది అన్నారు.ఈ నెల 8వ తేదీన మొదటి బ్యాచ్ లో 30 మంది 22వ తేదీన మరో 35 మందిని పంపించడం జరిగింది అన్నారు. విజయవంతంగా కంటి ఆపరేషన్ చేసి తిరిగి 24 వ తేదీన చెన్నూర్ పంపించడం జరిగింది అన్నారు.ఈరోజు మరో 30 మందిని ఆపరేషన్ నిమిత్తం రేకుర్తికి పంపించమని తెలియజేశారు. చెన్నూర్ దేవాలయ సభ్యులు రిటైర్డ్ టీచర్ రాములు ,జాడి తిరుపతి, రమేష్ ,రవి లు క్యాంపు నిర్వహించి ప్రజలకు ఇట్టి సదుపాయం కల్పించడం సంతోషంగా ఉందని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.