మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాంపు…

మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాంపు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లి గ్రామంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో హాస్పిటల్ మెయిన్ చీఫ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తమ సామాజిక బాధ్యత అని భావిస్తున్నామని. పండుగల సెలవులు అనే తేడా లేకుండా 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని. అవసరమైతే రోగులను పరీక్షించి కరీంనగర్లోని మేడి కవర్ ఆసుపత్రికి తరలించి ఆధునిక వైద్యం అందిస్తామని తెలుపుతూ. మేడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత శిబిరం నిర్వహించగా అందులో సుమారు 150 మందికి పైగా రోగులకు పరీక్షించి నిపుణులైన వైద్యులచే సేవలు అందించామని. అలాగే అవసరమైన వారికి షుగర్ బీపీ. ఈసీజీ. ట్రూడికో. వంటి కీలక పరీక్షలు నిర్వహించి తక్షణo నిర్ధారణ చేశామని. పరీక్షలు చేయించుకున్న వారికి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి లింగారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఉచితంగా న్యాన్యమైన వైద్య సేవలు అందించిన మెడికల్ ఆసుపత్రి యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత శిబిరంలో మెడికల్ మార్కెటింగ్ మేనేజర్ కోటా కరుణాకర్. అబ్దుల్ వకీల్. శ్రీకాంత్. లక్ష్మీ రాజం. వార్డు మెంబర్లు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version