జాతీయ డెంగ్యూ దినోత్సవ కార్యక్రమంపై అవగాహన….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లోని స్థానిక ప్రాథమిక వైద్యశాలలో. జిల్లా వైద్యాధికారి రజిత ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణకు ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇండ్ల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జ్వరం తలనొప్పి ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని. గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యశాఖ సిబ్బందికి సహకరించాలని. గ్రామంలో ఏమైనా సమస్యలు పరిసరాలు శుభ్రంగా లేనిచో సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని. ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే గ్రామంలోని ఆశ వర్కర్ల గాని సంప్రదించి గ్రామపంచాయతీ సిబ్బందికి. సమాచారం అందించి గ్రామాలలో వాడ.వాడల చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. తంగలపల్లి గ్రామ సర్పంచ్ మోర లక్ష్మీరాజo. పద్మ నగర్ గ్రామ సర్పంచ్ మోర నిర్మల. వైద్య అధికారి గ్రామపంచాయతీ సిబ్బంది వైద్యశాల సిబ్బంది ఆశ వర్కర్లు అధికారులు పాల్గొన్నారు
