>.సమర్థవంతంగా 10వ తరగతి పరీక్షలు.
>..విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
>..విద్యార్థులారా ఆల్ ది బెస్ట్.
>..బిజెపి మహిళా అధ్యక్షురాలు డీకే అరుణ.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటిధాత్రి
మహబూబ్ నగర్ జిల్లాలో పదవ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు నేటి నుండి జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో అందరు విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలనీ బిజెపి మహిళా అధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. విద్యార్థుల మదిలో ఎలాంటి భయాందోళన లేకుండా తాము చదువుకున్న పాఠాలు గుర్తుతెచ్చుకొని ప్రశ్నలకు సరైన జవాబులు రాసి నిలకడగా నిశ్చింతగా విద్యార్థులు వ్యవహరించాలని కోరారు. పరీక్షా సమయంలో ఇలాంటి ఉత్కంఠలకు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఏవైనా అనుమానాలు ఉంటే ఇన్విజిలేటర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత నుండి వచ్చే విద్యార్థులు ఎవరైనా పరీక్షా సమయం దాటిపోతుందని లిఫ్ట్ అడిగితే ప్రజలు కూడా మానవతా దృక్పథంతో సహకరించాలని సూచించారు. అదేవిధంగా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. పదో తరగతి హాల్‌టికెట్‌ను చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లొచ్చు. అల్ట్రా పల్లె వెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా వెళ్లి రావొచ్చని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. జిల్లాలోని మండల కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు
అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆమె తెలిపారు.
దీనికోసం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా హాజరుకానున్న విద్యార్థులు.
5 నిమిషాల వరకు ఆలస్యానికి అనుమతి ఉందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. విద్యార్థులకు డికే. అరుణమ్మ ఆల్ ది బెస్ట్ చెప్పారు