నకిలీ పత్తి విత్తనాల కేసులో నలుగురు అరెస్ట్
తాండూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాపై పోలీసులు కీలక చర్యలు చేపట్టి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాశామని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ వివరాలను వెల్లడించారు.రెచిని గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద బైక్‌పై నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారనే సమాచారం మేరకు తాండూర్ ఎస్సై ప్రసాద్,వ్యవసాయ అధికారి సుష్మ,పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో సుమారు 30 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టైన నిందితుల వివరాలు
గోగర్ల మల్లేష్ రోళ్ళపాడు,
ముక్క శ్రీకాంత్ రెచిని,
గాండ్ల మహేష్ రెచిని,
పిడుగు లక్ష్మణ్ రెచిని
ఈ విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వ్యాపారి తిరుమలశెట్టి రామకృష్ణ సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు.అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.ఈ సందర్భంగా
ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల వాడకం వల్ల భూమి సారవంతత తగ్గడంతో పాటు పంట దిగుబడులు కూడా దెబ్బతింటాయని హెచ్చరించారు.అలాగే పర్యావరణానికి హాని కలగవచ్చని తెలిపారు.గ్లైఫోసేట్ కలిగిన నకిలీ విత్తనాల వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు.రైతులు ప్రభుత్వం గుర్తించిన,లైసెన్సు కలిగిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు.గ్రామాల్లో ఎక్కడైనా నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని,సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
