Former ZPTC Visits Bereaved Family
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన – మాజీ జెడ్పిటిసి
మహాదేవపూర్ అక్టోబర్ 16 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం గ్రామం బెగులూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాధిత కుటుంబాన్ని శుక్రవారం రోజున మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ పరామర్శించారు. మండలంలోని బెగులూర్ గ్రామానికి చెందిన శంకర్అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని బాధిత కుటుంబాన్నీ పరామర్శించిన అనంతరం ఆయనకు పార్టీ అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు
