అంత్యక్రియలకు హాజరై పాడే మోసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నగర్ 22వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ ముంజల రవీందర్ తండ్రి ఐలయ్య అనారోగ్య పరిస్థితులతో మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అంత్యక్రియలకు హాజరై పాడే మోసినారు అనంతరం మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్ కు మనోధైర్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ముంజాల రవీందర్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసి మెంబర్ చల్లూరి మధు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బుర్ర కొమురయ్య మాజీ జెడ్పిటిసి పులి తిరపతి రెడ్డి అంబాల శీను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు