
జమ్మికుంట: నేటి ధాత్రి
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,పిసిసి మాజీ అధికార ప్రతినిధి,కాంగ్రెస్ వాయిస్ చీప్ ఎడిటర్ తుమ్మేటి సమ్మిరెడ్డి కుటుంబాన్ని గురువారం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు తుమ్మేటి సమ్మిరెడ్డి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంట జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ దిడ్డి రాము ,చిట్యాల మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్, తదితరులు ఉన్నారు.