నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
దుగ్గొండి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన దుగ్గొండి గ్రామ పార్టీ అధ్యక్షులు కూస రాజు తల్లి కూస మల్లికాంబ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు.బుదవారం మృతురాలి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్ రావు, సర్పంచ్ మంజుల నర్సింహరెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్,మండల పార్టీ ఉపాధ్యక్షుడు బూర హెమచంద్ గౌడ్, గుండేకారి రంగారావు,పలువురు
నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.