Fourth Anniversary Tribute to Yadagiri Reddy
ఘనంగా మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి నాలుగవ వర్ధంతి
రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా
రామన్నపేట పట్టణ కేంద్రంలో సిపిఐ మాజీ శాసనసభ్యులు తెలంగాణ సాయుధ పోరాట సమరయోధుడు కామ్రేడ్ గుర్రం యాదగిరి రెడ్డి నాలుగవ వర్ధంతి సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలో ఘనంగా నివాళులు జోహార్లు అర్పించి కామ్రేడ్ గుర్రం యాదగిరి రెడ్డి త్యాగాలను స్మరించుకుంటూ రామన్నపేట సిపిఐ మండల కార్యదర్శి ఊర్కూరి నరసింహ మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సొంత ఇల్లు కూడా లేకుండా ప్రజాసేవకు అతని జీవితాన్ని అంకితం చేశారు ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు నేటి యువతకు యాదగిరి రెడ్డి జీవిత చరిత్ర ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నాయకులు పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి ఏఐటీయూసీ మండల కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య మండల సహాయ కార్యదర్శి కళ్లెం రామచందర్ సీనియర్ కామ్రేడ్ ఊట్కూరి భగవంతు ఏనుతల రమేష్ ఊట్కూరి కృష్ణ సిహెచ్ మల్లేశం మీసం గాలయ్య కళ్లెం యాదగిరి కొండ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు
