
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ పోచమ్మ (శీతలాదేవి) ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయంలో శీతల దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాతనమైన దేవాలయ అభివృద్ధి కోసం తన హయంలో రూ.15 లక్షలు సహాయం అందించినట్లు తెలిపారు. ఆలయం లో మొదటిసారి సంప్రదాయ పూజలు చేయడం, పట్టువస్త్రాల సమర్పణ చేయడం మంచి విషయమని అన్నారు. రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్ వేదావత్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నవకాంత్, సతీష్, నరేందర్, చారీ తదితరులు పాల్గొన్నారు.