
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కాళేశ్వరం పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్ది కవరేజికి వచ్చిన ఓ జర్నలిస్ట్ పైవచ్చేసిన వాఖ్యలను,దురుసుగా ప్రవర్తించిన తీరును తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జిల్లా కమిటీ పక్షాన తీవ్రంగా ఖండించారు.సోమవారం భూపాలపల్లి కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టి ఎస్ జేయు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి జల్ది రమేష్,రాష్ట్ర నాయకులు పావుశెట్టి శ్రీనివాస్ లు మాట్లాడుతూ కాళేశ్వరం సందర్శనకు బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు గత శుక్రవారం పర్యటించిన నేపథ్యంలో కవరేజ్ కి వచ్చిన జర్నలిస్ట్ పై దురుసుగా ప్రవర్తించడం బాధాకరం అన్నారు.ఎన్నో కష్టనష్టాలకొర్చి ప్రజల సమస్యలను ప్రభుత్వం,అధికారుల దృష్టికి తీసుకెళ్లేందు జర్నలిస్ట్ లు పాటుపడుతుంటే మాజీ మంత్రి,ఎమ్మెల్యే హోదా మరిచి జర్నలిస్టుల ను చులకనగా చూడటాన్ని జర్నలిస్ట్ సమాజం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.సదరు జర్నలిస్ట్ పై జగదీష్ రెడ్ది చేసిన వాఖ్యలను భేరాషుతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో జర్నలిస్ట్ ల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
అదేవిధంగా అసెంబ్లీలో జర్నలిస్ట్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన జర్నలిస్టుల పక్షాన నిలిచిన కొత్తగూడెం ఎమ్మలే కూనంనేని సాంబశివరావుకు టీఎస్ జేయు పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ సమావేశంలో టీఎస్ జేయు నాయకులు మారపెల్లి చంద్రమౌలి,కనుకుల దేవేందర్,శేఖర్ నానీ,సతీష్ తదితరులు పాల్గొన్నారు.