గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి, వినతి పత్రం అందజేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూడూరి మణెమ్మ మల్లేశం

కరీంనగర్, నేటిధాత్రి:

మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అయిన సందర్భంగా వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చనందుకు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూడూరి మణెమ్మ మల్లేశం. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలీ మాటల ప్రభుత్వంగానే ఉన్నది తప్ప సామాన్యునికి ఇప్పటికీ ఎలాంటి ఒక్కహామీ కూడా నెరవేర్చలేదని వారు ఇచ్చిన హామీలు మాటలు కోటలు దాటుతున్నాయని, ఆచరణలో మాత్రం ఉండట్లేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబానికి ఇరవై కిలోలు ఉన్న బియ్యాన్ని ఎత్తివేసి కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి ఆరు కిలోల బియ్యం కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చారని, ఇప్పుడు రేషన్ కార్డుల జారీ కూడా ఏదో చారిత్రాత్మక కార్యక్రమంలగా చేస్తున్నారని, రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి యాభై శాతం కూడా మాఫీ చేయలేదని, కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లాక్ డౌన్ నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను కూడా ఎదుర్కొని 28,275 కోట్ల రుణమాఫీ చేసినాడని, రైతుబంధు సంవత్సరానికి రెండు విడతలుగా క్రమం తప్పకుండా ఎకరాకు పదివేల చొప్పున మొత్తం 73,162 కోట్లు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదని, మీప్రభుత్వం వచ్చిన తర్వాత మీహామీలను నమ్మి మీరు అధికారంలోకి వచ్చిన నాలుగు వందల ఇరవై రోజులలో నాలుగు వందల పన్నెండు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆటో డ్రైవర్లు వందమందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, గురుకులాలలో మీప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కల్తీ ఆహారం తిని యాబై ఐదు మందికి పైగా విద్యార్థులు దుర్మరణం పాలయ్యారని, మాప్రభుత్వంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తూ చేనేతలకు ఉపాధి కల్పించేవారని, ఇప్పుడు ఆడపడుచులకు చీరలు లేవు చేనేతలకు ఉపాధి లేదని, ఇప్పటికి చేనేతలు ముఫై మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారని ఇకనైనా దొంగ హామీలు దొంగ వాగ్దానాలు బందు చేసి ప్రజలకు మేలు జరిగే విధమైన పాలన అందియ్యాలని కోరుతున్నామన్నారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పూడూరు, మల్లేశం అంబెడ్కర్ సంఘం అధ్యక్షులు రేణికుంట అశోక్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మండల నాయకులు బుదారపు కార్తీక్, దాసరి శంకర్, సిపెల్లి మధు, బండపల్లి బాపురాజు, ఆరెల్లి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!