భద్రాచలం నేటి ధాత్రి
పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో భద్రాచలం నియోజకవర్గంలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది.
ఇంటింటి ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అమలు చేసిన విధానాన్ని వివరించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోరుతూ ఇచ్చిన హామీలను,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ ని గెలిపించుకోవడం ద్వారా భద్రాచల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతామని ఆయన ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు.
పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాసమల్ల రాము, అన్నేం రామిరెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు షబిర్ పాషా,మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.