నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :-
మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దంపతులు సోమవారం ఐలోని మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. కడియం దంపతులు కడియం శ్రీహరి విణయ రాణిల వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఐనవోలు లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న సన్నిధిలో కడియం దంపతులను స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు చల్ల రాజు కాంగ్రెస్ నాయకులు టేకుమట్ల ఐలయ్య నాగరాజు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.