నోటీసులు ఇచ్చిన అగని నిర్మాణాలు..
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలో టౌన్ ప్లానింగ్ కు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాల కట్టడాల పట్ల మేము ఇచ్చిన నోటీసుల గడువు తీరిన తర్వాత అక్రమ కట్టడాల పై కోరడాజులిపిస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలుపుతున్నారు. నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డు గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనక నిర్మిస్తున్న భవన నిర్మాణం పనులు మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు సంబంధిత భవన నిర్మాణ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారు నిర్మిస్తున్న భవనంలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాల్సి ఉండగా నర్సంపేట టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన డిమాండ్ నోటీసులను తుంగలో తొక్కి నిర్మాణ పనులు మాత్రం. యేదెచ్చగా
కొనసాగిస్తున్నారని పట్టణ ప్రజలు,ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాను.అయినప్పటికీ నిబంధనల ప్రకారం కాకుండా విరుద్ధంగా పనులు చేపడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు మేము ఇచ్చిన నోటీసు గడువు ముగిసిన తర్వాతనే చర్యలు తీసుకుంటామనడంలో ఆంతర్యం ఏమిటని ప్రజా సంఘాలు,పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ నర్సంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన నోటీసులకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో నిర్మాణాల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.