
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు మైసా ఉపేందర్
పరకాల నేటిధాత్రి
ఎస్సీ వర్గీకరణ అమలుపై మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ మౌనం వీడాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు.పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యస్.సి.వర్గీకరణ అమలులో తెలంగాణ రాష్ట్రంలోని మాదిగలకు 12% రిజర్వేషన్ అమలు కొరకు మరియు జిల్లాలను యూనిట్ గా తీసుకొని యస్.సి.వర్గీకరణ చేసే విదానంలో ప్రతిపక్ష నేత,మాజీ ముఖ్యమంత్రి కె.చెంద్రశేఖర్ రావు మోనం వీడి,యస్.సి.వర్గీకరణపై మాట్లాడాలని కోరారు.త్వరలో యస్.సి.వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు జరిగే విధంగా కృషి చేయటానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తామని తెలిపారు.రాష్ట్రంలోని మాదిగ సంఘాల నాయకులు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు.