సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం కొరకే ఈ గ్రామ, వార్డు సభల ఏర్పాటు..
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి నియోజకవర్గం గణపురం/భూపాలపల్లి మున్సిపాలిటీ/రేగొండ/కొత్తపల్లిగోరి/మొగుళ్ళపల్లి/టేకుమట్ల/చిట్యాల మండలాల
అర్హులైన చిట్ట చివరి లబ్ధిదారు వరకు అభివృద్ది, సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం రోజుకు పద్దెనిమిది గంటల పాటు శ్రమిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాలల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు పర్యటించారు. ముందుగా ఉదయం 9 గంటలకు గణపురం మండలం కొండాపూర్, ధర్మారావుపేట గ్రామాలల్లో జరిగిన వార్డు సభల్లో పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 23వ వార్డు రాజీవ్ నగర్ కాలనీ, రేగొండ మండలం కొత్తపల్లి(బీ), కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్, మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట, టేకుమట్ల మండలం గరిమిళ్లపల్లి, చిట్యాల మండలం గోపాలపూర్ గ్రామాలల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ మరియు వార్డు సభలల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.
అనంతరం ఆయా గ్రామ మరియు వార్డు సభలల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…. జనవరి 26వ తేదీ నుండి ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి గత మూడు రోజులుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లిస్టు లో పేర్లు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాపాలన, కులగణన సర్వేలో భాగంగా సేకరించిన ఫిర్యాదులతో పాటు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సిబ్బంది ఇంటింటికి వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపిక చేయబడిన లబ్ధిదారుల వివరాలను గ్రామసభలలో ప్రజల సమక్షంలో చదివి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ వార్డు మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కూడా అతికించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా అర్హులైన వారు ఉండి జాబితాలో పేరు లేనివారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తులను కూడా పరిశీలించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని అర్హత ఉన్నప్పటికీ పథకంలో పేరు లేని వారు నిరాశ నిస్పృహలకు లోను కావద్దని ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలులో భాగంగా అర్హులైన వారందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ఇందిరమ్మ ఇళ్లు మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఇస్తున్నట్లు తెలిపారు. తరువాతి దశలో భూమి లేని వారికి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ చల్లూరు మధు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవున్ పట్టణ ప్రధాన కార్యదర్శి పిప్పాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీషు రేగొండ మండల అధ్యక్షుడు విప్పగారి నరసయ్య మున్సిపల్ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ చిరుప అనిల్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కమల ఇర్ఫాన్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోమల అంబాల శీను తోట రంజిత్ బౌత్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు