
టూ వీలర్ మెకానికుల సంగమ్ ఏకగ్రీవ తీర్మానం అక్క గెలుపు కోసం 5000 రూపాయలు టూ వీలర్ మెకానికుల సంఘం డొనేషన్ చేయడం జరిగింది
మెకానిక్ ల భవన నిర్మాణం కోసం 5 గంటల స్థలం ఇచ్చిన పద్మాదేవేందర్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తాం
రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి.
ఈరోజు మెదక్ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారితో మెదక్ టౌన్ టూ వీలర్ బైక్ మెకానిక్ అసోసియేషన్ మెదక్ జిల్లా అధ్యక్షులు గాండ్ల బాలరాజ్ మరియు మెదక్ పట్టణ టూ వీలర్ అధ్యక్షులు బాలకృష్ణ గార్లు సమావేశం అయ్యి బైక్ మెకానిక్ ల సమస్య ల గురించి మెకానిక్ లు పడుతున్న ఇబ్బందుల గురించి తెలిపి వారి సమస్యలను పరిష్కరించాలని మెదక్ అసెంబ్లీ ఇంచార్జి తిరుపతి రెడ్డి గారిని కోరడం జరిగింది..
దీని పై తిరుపతి రెడ్డి గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ సమస్యలన్నింటిని పరిష్కారం దిశగా పని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి పద్మదేవేందర్ రెడ్డి గారితో చర్చించి ఎలక్షన్ పూర్తి కాగానే మెకానిక్ ల సమస్యలు అన్నిటిని తీర్చే బాధ్యత నాది అంటూ… మెకానిక్ అసోసియేషన్ వారికీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, బైక్ మెకానిక్ లు రవి, లక్ష్మణ్, రాజి రెడ్డి, సందీప్, శేఖర్ బూపాల్, మురళి, మధు, గోపాల్, తదితరులు పాల్గొన్నారు