హోటల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
భూపాలపల్లి నేటిధాత్రి
సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాలేశ్వరంలో ఏర్పాటు చేసిన ఆహార స్టాళ్ల లో ఆహార భద్రత ప్రమాణాలపై భూపాలపల్లి, ములుగు ఆహార తనిఖీ అధికారులు వరుణ్ రెడ్డి, ధర్మేంద్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టాల్ నిర్వాహకులకు పరిశుభ్రత, నాణ్యమైన ఆహార పదార్థాల వినియోగం, భద్రతా ప్రమాణాలు పాటింపు వంటి అంశాలపై ప్రత్యేక సూచనలు చేశారు.
పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యతను స్టాల్ యజమానులు గుర్తుంచుకోవాలని అధికారులు ఆహార తనిఖీ అధికారులు సూచించారు. ఆహార పదార్థాల నిల్వ, తయారీ, వడ్డనలో పాటించాల్సిన నియమాలు, చేతుల పరిశుభ్రత, తాగునీటి వినియోగం వంటి అంశాలపై ప్రాక్టికల్ డెమో నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు ఆహార తనిఖీ అధికారులు మాట్లాడుతూ, భక్తుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఎలాంటి ఆహార పదార్థాలు నాణ్యతలో నిర్లక్ష్యం సహించబోమని, నిబంధనలు పాటించని వ్యాపారులపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పుష్కరాల కాలంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగరాజు, శాంపిల్స్ సేకరణ సిబ్బంది, నరేష్, ల్యాబ్ టెక్నిషియన్ నరేష్, సహాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
