
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్ లో గురువారం ‘ఫుడ్ ఫెస్టివల్’ను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులే స్వయంగా రకరకాల వంటలతో పాటు తయారుచేసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.చిన్నారులు ఉత్సాహంగా పోటీపడి వంటలను ఎంతో రుచికరంగా తయారు చేసి అబ్బురపరిచారు.విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్కూల్ కరస్పాండెంట్ బూర ఉమా రమేష్ చెప్పారు. జంక్ ఫుడ్‌తో పోశకాలున్న ఆహారాన్ని మర్చిపోతున్న ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ తాటికొండ రమేష్, ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.