
కారేపల్లి నేటి రాత్రి.
వైరా నియోజకవర్గ ప్లేయింగ్ స్క్వాడ్ సింగరేణి మండలంలో తనిఖీలు నిర్వహించగా మూడు చోట్ల సుమారు 60 లీటర్ల మద్యం పట్టుకున్నారు. దాని విలువ సుమారు 66,000/- ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్లయింగ్ స్క్వాడ్ అధికారి కర్ణపూడి,నవీన్, ఆద్వర్యంలో సిబ్బంది బి బాలాజీ, ఎల్ రమేష్ , జే సర్దార్ సింగ్ కారేపల్లి మండలంలో విస్తృత తనిఖీలు నిర్వహించగా మద్యం పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారి కర్ణపుడి నవీన్ మాట్లాడుతూ మండలంలో తనిఖీలు నిర్వహించగా జోరుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తనిఖీలు సుమారు 66, వేల విలువ గల మద్యం పట్టుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్న చట్ట విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుపుతున్న వారు పట్టుబడడం జరిగిందని అన్నారు. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడడంతో మండలంలో జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్న పట్టు పడడంతో దొరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తామంటూ పట్టుబడిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్లు కారేపల్లి పోలీస్ స్టేషన్ పిర్యాదు చేసి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అదికారి కర్ణపూడి ,నవీన్, బాలాజీ, రమేష్ ,సర్దార్ సింగ్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.