అక్రమ పశువుల రవాణాపై ఫ్లెక్సీ ఏర్పాటు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ హెచ్చరికలు జారీ
గీసుగొండ,నేటిధాత్రి:
కొమ్మాల పశువుల అంగడి వద్ద అక్రమ పశువుల రవాణా నివారణపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గీసుగొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ఫ్లెక్సీలు
శుక్రవారం ఏర్పాటు చేశారు.పశువులను అక్రమంగా రవాణా చేయడం, అధిక సంఖ్యలో లోడ్ చేయడం, సరైన పత్రాలు లేకుండా తరలించడం, జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించడం చట్టరీత్యా నేరమని సీఐ విశ్వేశ్వర్ ప్రజలకు తెలిపారు.
పశువుల రవాణాకు సంబంధిత అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, వాహనాల్లో అధిక సంఖ్యలో లోడ్ చేయరాదని, పశువులకు ఆహారం, నీరు, తగిన స్థలం కల్పించాలని సూచించారు. జంతువులపై క్రూరత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అక్రమ పశువుల రవాణా గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. జంతు సంరక్షణ చట్టాలు, రవాణా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.
