వనపర్తి నేటిదాత్రి;
కేంద్రంలో వనపర్తి జిల్లా కేంద్రంలో సాయుధ కేంద్ర పోలీసు బలగాలతో జిల్లా శ్రీమతి ఎస్పీ కె . రక్షితమూర్తి ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామ ని అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి డి.ఎస్.పి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు . పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రజలను కోరారు . ఈ కార్యక్రమంలో రామరాజు వినోద్ కుమార్ రిజర్వు సీఐ శ్రీనివాస్ వనపర్తి సిఐ నాగభూషణం టౌన్ ఎస్ఐ జయన్న పోలీసులు పాల్గొన్నారు