
Fitness Hub Gym Inaugurated in Zaheerabad
ఫిట్నెస్ హబ్(జిమ్)సెంటర్ ని ప్రారంభించిన
◆:-తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
◆:- రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ టౌన్ : పట్టణంలోని సిద్ది హోటల్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ హబ్(జిమ్)సెంటర్ ని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం జిమ్ సెంటర్ యజమానులు మోహీన్,తైసీన్ వారిని ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.