ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక భరోసా…..

ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక భరోసా…..

◆-: ప్రతి ఆడబిడ్డల పెళ్లికి కానుకగా రూ.21వేలు సర్పంచ్ షరీఫ్ పెళ్లిలో పాల్గొని 21 వేలు అందజేసిన సర్పంచ్ షరీఫ్ ఇచ్చిన హామీ మాట నిలబెట్టుకుంటూన్న సర్పంచ్ షరీఫ్ సర్పంచ్ షరీఫ్ చేసే కృషికి హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామ సర్పంచ్ షరీఫ్ మా గ్రామంలో వివాహం చేసుకునే ప్రతి ఆడబిడ్డకు మేనమామలా పెద్దగా ఉండి ఆర్థికంగా 21 వేలు ఇచ్చి అండగా ఉంటానని సర్పంచ్ షరీఫ్ అన్నారు .సర్పంచ్ షరీఫ్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని సోమవారం రాత్రి గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు ఆయన హాజరై వధూవరులను ఆశీర్వదించడమే కాకుండా తన వంతు బాధ్యతగా రూ.21 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి ఉదారతను చాటుకున్నారు.
సర్పంచ్ షరీఫ్ “నేటి ధాత్రి” న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆడబిడ్డల పెళ్ళిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదన్నదే తన సంకల్పమని, అందుకే ప్రతి ఆడబిడ్డ వివాహనికి ఈ ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు .ఈ పెళ్లి కార్యక్రమంలో వారితో పాటు నాయకులు మోసిన్ భాయ్, రాంరెడ్డి, మొయిజ్లు ప్రజా సంక్షేమమే అక్ష్యంగా సర్పంచ్ షరీఫ్ చేస్తున్న కృషికి అభినందనీయమని కొనియాడారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version