రేవంత్‌కు ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ఎన్నికలు

· మున్సిపల్ శాఖ ఆయన కింద వుండటమే ప్రధాన కారణం

· మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై మున్సిపల్ ఫలితాల ప్రభావం

· 2029 ఎన్నికల వరకు రేవంత్ పదవికి ఢోకా వుండదు

· ఫలితాలు తారుమారైతే అసమ్మతి గళాలు బలపడవచ్చు

· సానుకూల ఫలితాలు బీఆరఎస్‌కు మళ్లీ ఊపిరిపోస్తాయి

· రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు మరింత ఆత్మవిశ్వాసాన్నివ్వగలవు

· రేవంత్ ప్రభుత్వంపై మరింత దూకుడు పెంచవచ్చు

· కొన్ని అర్బన్ ప్రాంతాల్లో తన పట్టును నిలుపుకోవడానికి బీజేపీ కషి

· పట్టణ వోటర్ల మనోగతం వేరు

· పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకోవడం సరికాదు

హైదరాబాద్, నేటిధాత్రి: 

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆరఎస్, బీజేపీలు ీVAరాీVAరీ తలపడ్డాయి. గతఉప ఎన్నికల్లో సాధించిన విజయాలు, పంచాయతీ ఎన్నికల్లో సాధించిన 53 నుంచి 55 శాతం పంచాయతీలు అధికార కాంగ్రెస్‌లో పూర్తిస్థాయి ఉత్సాహాన్ని నింపాయనడం కంటే, విపక్ష బీఆరఎస్‌పై తన ఆధిపత్యాన్ని కొంతమేర నిలబెట్టుకున్నదని చెప్పాలి. ముఖ్యంగా గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్న బీఆరఎస్ పంచాయతీ ఎన్నికల్లో 26.99% నుంచి 33% వరకు పంచాయతీలను కైవసం చేసుకోవడం ద్వారా పడిలేస్తున్న సంగతిని కాంగ్రెస్‌కు సుస్పష్టంగా తెలియజెప్పింది. ఇవి ఒకరకంగా అధికార పార్టీకి ప్రమాదఘంటికలేనని చెప్పాలి. కంటోన్మెంట్, జూబిలీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం వెనుక స్థానిక కారణాలుండవచ్చు. కానీ పంచాయతీ ఎన్నికల్లో 80 నుంచి 85శాతం పంచాయతీలను గెలుచుకున్నప్పుడు మాత్రమే అధికార కాంగ్రెస్‌కు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలపై గట్టి పట్టున్నదని స్పష్టమవుతుంది. కానీ 50% కంటే కొద్దిగా ఎక్కువ స్థానాలు గెలవడం కాంగ్రెస్‌కు శుభసూచికం కాదు. రైతుభరోసా, వంటి సంక్షేమ పథకాల సత్వర అమలు, నీటిపారుదల, పంచాయతీల పనితీరు గ్రామీణ ఓటర్ల ను ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. 80 నుంచి 85శాతం పంచాయతీలు కైవసం చేసుకున్నట్లయితే గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు వీస్తున్నట్టుగా భావించాలి. కానీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు దీనికి సంకేతించడంలేదు. పట్టణ వోటర్ల ప్రాధాన్యతలు గ్రామీణఓటర్లకు భిన్నం. ముఖ్యంగా వీరు మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన పాలన, సంక్షేమ పథకాల అమలు, శాంతిభద్రతలపై ప్రధానంగా దష్టి కేంద్రీకరిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వోటర్ల మధ్య తమ అవసరాలకనుగుణమైన భిన్నత్వం వుండటంవల్ల పంచాయతీ ఎన్నికల్లో కాం గ్రెస్ సాధించిన కొద్దిపాటి సానుకూలత ప్రభావం, మున్సిపల్ ఎన్నికలపై పడుతుందనుకోవడంఅంత సమంజసం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పూర్తి సానుకూలతను సాధించలేకపోవ డానికి ప్రధాన కారణం, ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమల్లో జరిగిన జాప్యం. తెలంగాణ ప్రజల మనోభావాల్లో 2025 రెండో అర్థభాగం నుంచి 2026 ప్రారంభం వరకు ఎంతో తేడా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలు, ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పులు ఇందుకు ప్రధాన కారణం. దీన్ని అధికార కాంగ్రెస్ గుర్తించి జాగ్రత్త పడకపోతే బీఆరఎస్ ఈ పరిస్థితిని తప్పకుండా తనకు అనుకూలంగా మార్చుకోగలదు. 

ఇక రేవంత్‌రెడ్డి భవిష్యత్తును ఈ మున్సిపల్ ఎన్నికలు నిర్దేశించనున్నాయి. ఇందులో గెలుపోట ముల ప్రభావం మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై తప్పనిసరిగా పడితీరుతుంది. పార్టీ అధిష్టానం కూడా మంత్రివర్గంలో ఇద్దరు, ముగ్గురు మంత్రుల పనితీరు బాగాలేదన్న ఉద్దేశంలో వున్న నేప థ్యంలో, ఎన్నికల ఫలితాలను మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల్లో విఫలమైతే, ఆరుగ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలు పున్ణసమీక్షకు గురయ్యే అవకాశ ముంది. మున్సిపల్ శాఖ కూడా తన ఆధీనంలోనే వుండటంతో ఇక్కడ గెలుపు రేవంత్‌కు ప్రతి ష్టాత్మ కంగా మారింది. ఫలితాలు ఎలావున్నా 2029 అసెంబ్లీ ఎన్నికలవరకు రేవంత్‌రెడ్డి పదవికి ఎటు వంటి ఢోకా వుండదు. ఈ ఎన్నికల్లో విజయం పట్ల ధీమాగా వున్నప్పటికీ, ఇటీవల రేవంత్‌రెడ్డి హడావుడిగా మంత్రివర్గ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో, పార్టీ అంతర్గత స ర్వేలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సానుకూలంగా లేకపోతే, పార్టీలో నివురుగప్పిన నిప్పులా వున్న అసంతప్తి ఒక్కసారి బయటకు వెల్లడికావచ్చు. ఆసంతప్తులు అప్పుడు తమ గళాన్ని మరింత గట్టిగా వినిపించడం మొదలుపెడతారు. ఇక పెరిగిన పం చాయతీ స్థానాలు బీఆరఎస్‌లో జోష్ నింపాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చూపిన దారుణ పనితీరుకు ఈ ఫలితాలు పార్టీకి వెలుగు రేఖలుగా కనిపించివుండవచ్చు. ఓటర్ల మనోగతాన్ని రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. మొదటిది ప్రభుత్వ పనితీరు కాగా రెండవది విపక్షం ప్రదర్శించే చురుకుదనం. ఈ రెండు అంశాల ఆధారంగా ముఖ్యంగా పట్టణ ఓటర్లు తమ ఆలోచనాశైలిని మార్చుకుంటారు. పట్టణ ప్రాంత ఓటర్లలో వస్తున్న మార్పును ఎప్పటికప్పుడు పసిగట్ట గలిగే రాజకీయ సునిశితత్వం ప్రదర్శించగలిగే పార్టీలు వెంటనే మేý£్కని పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవడమో, మరింత దెబ్బతినకుండా జాగ్రత్త పడటమో జరుగుతుంది. మొద్దునిద్ర ప్రదర్శించే పార్టీలు కనుమరుగు కాక తప్పదు. బీఆరఎస్ విపక్ష స్థానంలో వుండటం వల్ల సంక్షేమ పథకాల అమలు, పరిపాలన, శాంతి భద్రతలు వంటి అంశాలపై ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు చేసే విమర్శలు, తమ పాలనలోని సానుకూలతలను ప్రజల మెదళ్లలో చొప్పించడానికి దోహదం చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు ప్రభుత్వ యం త్రాంగం యావత్తు చేతిలో వున్నప్పటికీ, తమ పనితీరుపై ప్రజల్లో అసంతప్తిని గుర్తించకపోతే ప్రమాదంలో పడక తప్పదు. ఎంత రాజకీయ చాతుర్యం వున్నా ప్రజల్లో వ్యతిరేకత ఒక్కసారి మొదలైతే అది సునామీ మాదిరిగా రూపొందకమానదు. 

ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో 85% నుంచి 90% స్థానాలు కైవసం చేసుకుంటామన్న ధీమా మంత్రుల్లో వ్యక్తమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం అంతర్గత సర్వేల్లో కనిపించిన సాను కూలత! ఇప్పటికే ఏకగ్రీవమైన 14 వార్డుల్లో 12 వార్డులను కాంగ్రెస్ గెలుచుకోవడం కొంత మానసికపరమైన సానుకూలతను కలుగజేయడం కూడా కాంగ్రెస్ మంత్రుల్లో కనిపిస్తున్న ధీమాకు కారణం కావచ్చు. అదీకాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి మున్సిపల్ పట్టణానికి ఒక మాస్టర్‌ప్లాన్‌ను ప్రకటించడం, చెత్త తొలగింపు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి తమకు అఖండ విజయాన్ని కట్టబెడతాయని కాంగ్రెస్ నేతలో గట్టి ధీమా వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా 2023 అసెంబ్లీ ఎన్నికలను స్పురణకు తెచ్చుకుంటే, కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన పనితీరు ప్రదర్శించగా, పట్టణ ప్రాంతాల్లో బీఆరఎస్ తన పట్టును కోల్పోలేదని స్పష్టమైంది. అదీకాకుండా ఇప్పుడు చాలా వార్డుల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థుల బెడదను ఎదుర్కొనడం ఒక మైనస్‌గా మారింది. తెలంగాణలో అత్యంత కీలకమైన వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో బీఆరఎస్‌కు సంస్థాగతంగా గట్టి పట్టును కొనసాగిస్తోంది. ఆయా నగరాల్లో బీఆరఎస్ నాయకులు హరీష్‌రావు, కేటీఆర్‌లు విస్తతంగా పర్యటించి ప్రచార కార్యక్రమాల్లో పాý£్గన్నారు. ముఖ్యంగా ఆ యా మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు, సంక్షేమ పథకాల అమలులో జాప్యంపై ప్రభుత్వాన్నిగట్టిగా నిలదీయడమే కాదు, తమ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఈ పట్టణాల అభివద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నదీ స్పష్టంగా వివరించారు.విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారం ముం దుకు సాగిందనేది సత్యమే అయినప్పటికీ, ఎంతమేర ఇవి ఓటర్లను ప్రభావితం చేసి, తమకు అనుకూలంగా ఓట్లు పడేలా చేస్తాయనేది ప్రశ్నార్థకమే! ఇదిలావుండగా మహబూబ్‌నగర్, నý£్గండ,రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్/ఛైర్‌పర్సన్ పదవులకు కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చే స్థితిలో వున్నది. అయితే ఈ కార్పొరేషన్లలో 60`65% వరకు వార్డులను గెలుచుకొని సునాయా సంగా మేయర్ పదవులను పొందగలుగుతామన్న ఆత్మవిశ్వాసం ఇక్కడి కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది. 

ఇక ఈ మున్సిపల్ ఎన్నికలు బీఆరఎస్‌కు అత్యంత కీలకంగా మారాయి. చావోరేవో అనే స్థాయిలో ప్రచారం నిర్వహించిన హరీష్, కేటీఆర్‌లకు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఎక్కువ స్థానాలను కై వసం చేసుకోవడం చాలా అవసరం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇవి సెమిఫైనల్స్‌గా భావించడమే ఇందుకు కారణం. 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీఆరఎస్ 100 మున్సిపాలిటీలను కైవ సం చేసుకుంది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండంలా బీఆరఎస్ భావిస్తు న్నది. ఈ నేపథ్యంలో పార్టీ పటిష్టం కోసం “బీఆరఎస్ 3.0” వ్యూహాన్ని అమలు చేస్తోంది. బూత్‌స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం, కొత్త నాయకత్వానికి స్థానం కల్పించడం. అభ్యర్థుల ఎంపికను స్థానిక నాయకత్వానికే అప్పగించడం ద్వారా విభేదాలకు తావులేకుండా చేయడం, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలైన నాయకులను తిరిగి ఆహ్వానించడాన్ని “బీఆరఎస్ 3.0” వ్యూహం కింద పార్టీ నాయకత్వం అమలు చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో చేరిన పదిమంది బీఆరఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు ఇప్పటికీ పెండింగ్‌లో కొనసాగుతుండం కూడాపట్టణ ప్రాంత ఓటర్లకు బీఆరఎస్ పట్ల సానుకూలతకు కారణమయ్యే అవకాశాలు లేకపోలేదు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో తమకు తిరుగులేదని కమలనాధులు విశ్వాసంతో వు న్నారు. ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో గణనీయంగా వోట్లను చీల్చడంలో బీజేపీ కీలక పాత్ర పోషించనుంది. స్థానిక అభ్యర్థి బలాన్ని బట్టి, బీజేపీ చీల్చే ఓట్లు, బీఆరఎస్ గెలుపునకు లేదా ఓటమికి కారణం కాగలవు. ఇక ఏఐఎంఐఎం మహబూబ్‌నగర్‌కు చెందిన 16 డివిజన్లలోపోటీచేస్తున్నది. ఇదే సమయంలో తనకు గెలుపు కష్టమని భావించిన ప్రదేశాల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తోంది. మొత్తంమీద చెప్పాలంటే తెలంగాణ రాజకీయాలను మలుపుతిప్పే రీతిలో ఈ మున్సి పల్ ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version