నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)
తాటి చెట్టు పై నుంచి పడి ఇటీవల మృతి చెందిన కమలాపూర్ కు చెందిన గీతా కార్మికుడు చీకట్ల బుచ్చయ్య కుటుంబానికి బీసీ కార్పొరేషన్ ద్వారా 25 వేల రూపాయల ఆర్థిక సాయం చెక్కును బీసీ కార్పొరేషన్ అధికారి రవీందర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో కమలాపూర్ గౌడ సంఘం అధ్యక్షులు జేరిపోతుల శ్రీనివాస్ మరియు కమలాపూర్ మండల గీతా కార్మిక సంఘం అధ్యక్షులు మార్క అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.