అండగా ఆదుకున్న పదవ తరగతి మిత్ర బృందం
వీణవంక, (కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రానికి చెందిన గెల్లు అశోక్ యాదవ్ జనవరి 26వ తేదీన అనారోగ్యంతో మృతిచెందగా వీణవంక ప్రభుత్వ పాఠశాలలో 2000-2001 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న మిత్ర బృందం మానవత దృక్పథంతో, గెల్లు అశోక్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ, మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళ అర్పించారు. తోటి మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని ఉద్దేశంతో 35 వేల రూపాయల విలువ గల ఫిక్స్డ్ బాండ్ డిపాజిట్ వీణవంక కో-ఆ పరేటివ్ బ్యాంకులో చేయించి, ఫిబ్రవరి 5 సోమవారం దశదినకర్మ రోజున గెల్లు అశోక్ యాదవ్ సతీమణి గెల్లు కోమల, ఇద్దరు కుమారులకు ఫిక్స్ డిపాజిట్ బాండ్ ను అందజేశారు.
అనంతరం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి మిత్రుడు అంబాల రాజేష్ కుటుంబ సభ్యులు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయాలు కాగా, వారి కుటుంబాన్ని పదవ తరగతి మిత్రులు పరమర్శించి, కుటుంబానికి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో అమృత ప్రభాకర్,ఓరేం పూర్ణచందర్, ముద్దెర శ్రీనివాస్, దాసరపు అంకుస్, ఐలవేణి రామన్న, ముజ్జమిల్, గిరవెన రవీందర్, బబ్బురి శ్రీనివాస్,బత్తుల తిరుపతి, కర్ర కోమల్ రెడ్డి, అంబాల నర్సింగ్, రెడ్డి రాజుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.