
Health insurance scheme for auto drivers...
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత….
ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా పథకంకు కృషి…
ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
నిత్యం రోడ్ల పై తిరుగుతూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లు వారి ఆరోగ్యం పై జాగ్రతలు తీసుకోకుండా అనారోగ్యాల బారిన పడుతున్నారని, వారికి ఎలాంటి ఆరోగ్య బీమాలపై సరైన అవగాహన ఉండట్లేదని అందుకే ఆటో డ్రైవర్లకు ఆరోగ్య భీమా పథకం అమలు చేయించేందుకు కృషి చేస్తానని రామకృష్ణాపూర్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య అన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలోని కనకదుర్గ కాలనికి చెందిన ఆటో డ్రైవర్ కొండ్ర రవి అనారోగ్యానికి గురై గత వారం మృతి చెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిది చాలా పేద కుటుంబం కావడంతో వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వారి కుటుంబానికి రామకృష్ణాపూర్ ఆటో యూనియన్ సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఎనగంటి సంపత్, ఉపాధ్యక్షులు పాక అంజయ్య, ప్రధాన కార్యదర్శి జీడి రవి, చెన్నాల సారయ్య ,ముల్కల నరసయ్య, ఆల్క పున్నం, వాసం సది తదితరులు పాల్గొన్నారు.