
టి సహ చర మిత్రుని కుటుంబానికి ఆర్థిక చేయూత
దాతృత్వం చాటుకున్న మండల టాక్సీ డ్రైవర్స్” ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండల టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కోమటిరెడ్డి రామకృష్ణారెడ్డి అకాల మరణం చెందడం జరిగింది, వారు కేసముద్రం ట్యాక్సీ యూనియన్ లో సభ్యులుగా ఉన్నారు వారికి శనివారం యూనియన్ తరపు నుండి చిలుముల మహేష్ అధ్యక్షుల ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే యూనియన్ సభ్యులంతా వారికి ఎప్పుడు ఏ అవసరమైన ఉన్నామని మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది కార్యక్రమంలో అధ్యక్షులు చిలుముల మహేష్,
ఉపాధ్యక్షులు పింగిలి సంతోష్
కోశాధికారి నాగన్న బోయిన నర్సయ్య
కార్యవర్గ సభ్యులు సిలువేరు గణేష్
సభ్యులు గాడి పెళ్లి సంతోష్ రావుల అనిల్.
పాల్గొనడం జరిగింది