పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండల అక్షరశక్తి విలేకరిగా పనిచేస్తున్న సుదమల్ల ప్రశాంత్ తండ్రి సారయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా అక్షరశక్తి పత్రిక ఎండీ పల్లె రవి వంశీమోహన్, బ్యూరో చీఫ్ ములుక రవి పలువురు విలేకరులతో కలిసి పరకాలలో శుక్రవారం ప్రశాంత్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న అక్షరశక్తి విలేకరుల సహకారంతో ప్రశాంత్‌కు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా క్రైం రిపోర్టర్ గౌతమ్, మడికొండ విలేకరి సుదమల్ల శ్రీనివాస్, హసన్‌పర్తి విలేకరి మధుకర్, పరకాల పట్టణ విలేకరి బొచ్చు శ్రీధర్, శాయంపేట విలేకరి గణేష్, స్థానిక సీనియర్ విలేకరులు గిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుకు ఆర్థిక సాయం
