వనపర్తి ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేరికి ఆర్థిక సహాయం ప్రకటించిన ఆర్యవైశ్యులు
వనపర్తి నెటిదాత్రి:
వనపర్తి పట్టణంలో చిట్యాల రోడ్ లో ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం ఆర్యవైశ్య కాంప్లెక్స్ దగ్గర వృధాగా ఉన్నది. బుధవారం నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ గా పూరి బాలరాజ్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మాజీ దహన కమిటీ చైర్మన్ పాలాది శ్రీనివాసులు సమావేశంలో మాట్లాడుతూ వనపర్తి లో ఆర్యవైశ్య సంఘానికి చందాల రూపంలో ఇచ్చిన దాతలతో వైకుంఠ రథన్ని కొనుగోలు చేశారనిఅన్నారు వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం రిపేరు ఉండడంతో నిరుపయోగంగా ఉందని చెప్పారు .వనపర్తి ప్రభుత్వ మున్సిపాలిటీ చెందిన వైకుంఠ రథం ఒకటి ఉన్నదని టైముకు అ వాహనం అందడలేదని అన్నారు ఈ మేరకు వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం రిపేరు చేయించడానికి ప్రపంచ రాష్ట్ర జిల్లా పట్టణ ఆర్యవైశ్య అనుబంధ సంఘాల సమీక్షంలో ఆర్యవైశ్య సంఘం దహన కమిటీ మాజీ చైర్మన్ 10000 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. వనపర్తి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ వెంటనే స్పందించి 2000 రూపాయలు ఆర్యవైశ్యుల సమీక్షంలో ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టికి అందజేశారు .ఈ మేరకు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ ఎల్ ఎన్ రమేష్ పట్టణ బిజెపి మాజి అధ్యక్షులు బచ్చురాం మారం బాలీశ్వరయ్య జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులు బాదం వెంకటేష్ వనపర్తి పట్టణ అ వో ప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు జర్నలిస్ట్ మారం గోవిందుగుప్తా వై వెంకటేష్ వజ్రాల సాయిబాబా కంది కొండ సాయరాం చవ్వ పండరయ్య గోకారం రాజు పిన్నం నరేందర్ హర్షం వ్యక్తం చేశారు వైకుంఠ రథానికి రిపేర్ కొరకు ఆర్థిక సహాయం ప్రకటించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు పట్టణ ఆర్యవైశ్య సంఘం సీనియర్ మాజీ అధ్యక్షులు బాదం సుధాకర్ నేటిదాత్రి దినపత్రిక విలేకరితో మాట్లాడుతూ వనపర్తి ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం రిపేరి చేయించడానికి తన వంతు కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు .. ల్ వెంటనే వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇటుకురి బుచ్చయ్య వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు వైకుంఠ రథాన్ని పట్టణ ప్రజలకు ఆర్యవైశ్యులకు వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య వైకుంఠ రథం ఎవరి స్వంత వాహనం కాదని ఆర్యవైశ్యుల చందాల రూపంలో వసూలు చేసి తెచ్చారని ఆయన గుర్తు చేశారు . ఆర్యవైశ్య వైకుంఠ రథము కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందించిన దాతలు వెంటనే విధి విధానాలు రూపొందించి వైకుంఠ రథాన్ని వినియోగంలోకి తీసుకు వస్తే వనపర్తి ఆర్యవైశ్యులు హర్షిస్తారని చేసిన సహాయాన్ని వనపర్తి ఆర్యవైశ్యులు మర్చిపోరని బాదం సుధాకర్ అన్నారు