సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కిన అధికారులు..
.. చట్ట ప్రకారం అడిగితే తప్పుడు వివరాలు..
… ఆగ్రహం వ్యక్తం చేసిన తై బజార్ నిర్వాహకులు..
సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్..
రామాయంపేట మార్చి 7 నేటి ధాత్రి (మెదక్)

రామయంపేట మున్సిపాలిటీ పరిధిలో గత పది సంవత్సరాల నుండి జరుగుతున్న తై బజార్కు సంబంధించి సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కోరగా రామాయంపేట మున్సిపాలిటీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని టై బజార్ నిర్వాహకులు వెంకు గారి శ్రీధర్ రెడ్డి, భూమ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాము గత పది సంవత్సరాలు నుండి జై బజార్ కు సంబంధించి సమాచారం కోరగా 2015-2016 సంవత్సరానికి గాను కాంట్రాక్టర్ రూ. ఆరు లక్షల 95 000 చెల్లించగా, మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఏడు లక్షల 20 వేలు చెల్లించినట్లు తెలిపారు. అలాగే 2017-2018 సంవత్సరానికి గాను 8,40,000 చెల్లించగా మున్సిపాలిటీ అధికారులు 11 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను 5 లక్షల 61 వేలు చెల్లించగా 10 లక్షల ఇరవై వేల రూపాయలు చెల్లించినట్లు మున్సిపాలిటీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తప్పుడు సమాచారం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ దేవేందర్ తోపాటు మేనేజర్ శ్రీనివాస్, అకౌంటెంట్ శ్రీధర్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.