మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని కోంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన
ఏర్పుల మీదింటి వెంకటయ్య అనారోగ్యంతో మరణించారు. వారి మృతికి సంతాపం తెలిపిన కొంరెడ్డిపల్లి గ్రామ సహాయక బృందం సభ్యులు, నీరటి రవీందర్,కారోబార్ వెంకటయ్య,శ్రీకాంత్ రెడ్డి,బండకాడి కృష్ణయ్య, అంతక్రియ ఖర్చుల నిమిత్తం 4000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోంరెడ్డి పల్లి గ్రామ సభ్యులు పోతనపల్లి వెంకటయ్య,జంగల్ల వెంకటయ్య,ఉత్తర వెంకటయ్య, ఏర్పుల రాములు, చిట్టి ముత్యాల భీమయ్య, ఏర్పుల రాములు, తదితర మిత్రులు పాల్గొన్నారు.