
అమ్మ ఆదర్శ పనుల జాప్యం పై అసంతృప్తి.
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పరిశీలన, సామాజిక ఆసుపత్రి తనిఖీ, పౌష్టిక ఆహారం సరఫరా పై ఆరా.
ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించి, ప్రజలకు అందుబాటులో ఉండాలి,కలెక్టర్ రాహుల్ శర్మ.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
ప్రభుత్వ అధికారులు సమయం పాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో అలసత్యం వహిస్తే సహించేది ఉండదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ మహాదేవపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన కొనసాగించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, మెట్పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల, కాలేశ్వరం కుంట్లం మధ్య ఉన్న రహదారిది పరిశీలించి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి సందర్భంగా చేపట్టి కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
మండల కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ ముందుగా సామాజిక ఆసుపత్రి నీ సందర్శించారు, ఆసుపత్రిలో వైద్యుల వివరాలు, సిబ్బంది హాజరు పట్టిక తోపాటు ప్రతిరోజు ఇంతమంది వైద్యులు సిబ్బంది హాజరవుతున్నారని ఆరా తీశారు, సామాజిక ఆసుపత్రిలో ప్రతిరోజు ఎంతమంది చికిత్స కొరకు వస్తున్నారని సుప్రీడెంట్ చంద్రశేఖర్ తో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ డయాలసిస్ సెంటర్ గోపి విభాగాన్ని కలెక్టర్ పరిశీలించారు, మౌలిక సౌకర్యాల కల్పనకై ప్రతిపాదనలు సంబంధిత వైద్య అధికారులకు అందించాలని ఆదేశించారు. మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కొరకు వైద్యులు అందుబాటులో ఉండాలని, సీజన్ వ్యాధుల పట్ల క్రమత్తంగా ఉండి డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధుల నివారణకు చర్యలతో పాటు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఆసుపత్రి ఆవరణలో ఆహ్లాదకరంగా ఉండేలా పండ్ల పూల మొక్కలను నాటాలని సుప్రీడెన్ కు కలెక్టర్ ఆదేశించారు.
మండలంలోని మెట్పల్లి ఎస్సీ కాలనీ మండల పరిషత్ పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పనులను పరిశీలించారు. పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో జిల్లా కలెక్టర్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పనులను త్వరగాతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ పనుల్లో జాప్యం రావడం జరిగిందని, నిరంతరంగా పనులు కొనసాగించుటకు అధికారులు పర్యవేక్షించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో పాటు మండల పరిషత్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీలకు అందించే పోషక పదార్థాలను బాలమృతం పాకెట్లను ఎక్స్పైర్ డేట్ లను ఘనంగా పరిశీలించారు. అనంతరం బాలింతకు బాల అమృతం పాకెట్ లు అందించారు. అలాగే కాలేశ్వరం నుండి కుంట్లం గ్రామానికి వెళ్లే ఐదు కిలోమీటర్ల ఆర్ అండ్ బి రహదారి చెడిపోవడం అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అలాగే మండల కేంద్రంలోని వీడియో కార్యాలయానికి సందర్శించి బుధవారం రోజున రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటనకు సంబంధించి, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరి ఇతర చేపట్టే కార్యక్రమాల వివరాలను అధికారుల నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, మండల పరిషత్, రెవెన్యూ ,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.