Tribute to Panduga Sayanna
పండుగ సాయన్న వర్ధంతి: ముదిరాజ్ సంఘం ఘన నివాళి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ముదిరాజ్ సంఘం తాలూకా భవనంలో బుధవారం నాడు ప్రజా వీరుడు పండుగ సాయన్న వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు, నాయకులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోపాల్ సార్, టౌన్ అధ్యక్షులు రమేష్, ప్రవీణ్, హరీష్, శంకర్, లింగమయ్య, మహేష్, విజయ్, అర్జున్, శ్రీనివాస్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని సాయన్నకు అంజలి ఘటించారు.
