నూతన కమిటీని అభినందించిన జెడిఎ అనురాధ.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
రేయనక పగలనక కష్టపడే రైతన్ననికి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తి ఫర్టిలైజర్ యజమానులు వారికి పంటలపై తగు సూచనలు చేసి సరైన పురుగు మందులు అందించి రైతన్నకు అండ దండగ ఉండాలని మండల ఫర్టిలైజర్ డీలర్లకు జె డి ఏ అనురాధ సూచన చేశారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మండల కేంద్రానికి తొలిసారి రాగా ఫెర్టిలైజర్ అసోసియేషన్ మండల కమిటీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలపగా అనంతరం మండల నూతన కమిటీకి ఆమె శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శశికాంత్, మండల అధ్యక్షుడు కాసం మదన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి మైనుద్దీన్, కోశాధికారి మామిళ్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు శివనాత్రి శ్రీనివాస్, గోనె వీరస్వామి, తిప్పని శ్రీనివాస్ గౌడ్, గంప కేదారి తదితరులు పాల్గొన్నారు.