టి యు డబల్యూజే( టీజేఎఫ్) వినతికి ఉత్తర్వులు జారీ చేసిన డి ఈ ఓ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం: జర్నలిస్ట్ ల పిల్లల కు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం జిల్లా లో వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో చదివే జర్నలిస్టు ల పిల్లలకు ఫీజులో రాయితీని కల్పించాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిది బృందం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ల నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జర్నలిస్ట్ ల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఫీజు ల సమస్య ను డి ఈ ఓ. కు వివరించారు. వెంటనే స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి జర్నలిస్టు ల పిల్లలకు ఫీజు లో 50 శాతం కల్పిస్తూ వెను వెంటనే ఉత్తర్వులు జారీ చేసి టి యు డబల్ యు జె నేతల కు అందించారు. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి కి యూనియన్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు చండ్ర నరసింహారావు, జిల్లా నేతలు కొత్త వెంకటేశ్వర్ల, సువర్ణపాక శోభన్ బాబు,నరసింహారావు, ప్రభాకర్ రెడ్డి, అబ్రహాం, చీమకుర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.