దివ్యాంగురాలైన కుమార్తెను పదో తరగతి పరీక్ష రాయించడానికి తండ్రి పడుతున్న తపన స్ఫూర్తిదాయకం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో గల పదవ తరగతి పరీక్ష కేంద్రానికి గణపురానికి చెందిన తరిగొప్పుల జితేందర్ తన కుమార్తె నైమిష దివ్యాంగురాలు కాగా తన కూతురు పదో తరగతి పరీక్షలకు బాగా రాసి మంచి మార్కులతో పాసై ఉన్నత చదువులు చదవాలనే తన తపనతో తన కూతురిని పరీక్ష కేంద్రం లోపలికి తన చేతులపై ఎత్తుకొని పరీక్షలు రాయించి తీసుకొస్తున్నాడు. నైమిశా బాగా చదివి పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తీసుకురావాలని నైమిష ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గురైన వరద బాధితుల కోసం తనకు వచ్చే పెన్షన్ డబ్బులు నుంచి 50 కిలోల బియ్యాన్ని సహాయం చేసిన గొప్ప మనసున్న నైమిష పదో తరగతి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని తల్లిదండ్రులు పాఠశాల యజమాన్యం కోరుకుంటున్నారు.